అందరూ కలిసి సానియామీర్జాను ఎందుకు నిందిస్తారు?: మద్దతుగా నిలిచిన క్రీడాలోకం

  • ఇండియాతో మ్యాచ్ లో పాక్ ఓటమి
  • డక్కౌట్ అయిన సానియా మీర్జా భర్త
  • ముందు రోజు డిన్నర్ కు వెళ్లడంపై విమర్శలు
నాలుగు రోజుల క్రితం మాంచెస్టర్ వేదికగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ లో పాక్ జట్టు ఓటమి పాలుకాగా, పాక్ జట్టులో కీలక ఆటగాడైన షోయబ్ మాలిక్ విఫలం కావడం వెనుక, ఆయన భార్య సానియా మీర్జా పాత్ర ఉందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ కు ముందురోజు తన భర్తను బయటకు తీసుకెళ్లి, జంక్‌ ఫుడ్ తినిపించిందని, అందువల్లే మాలిక్ డక్కౌట్ అయ్యాడని వేలాది కామెంట్లు వస్తుండటంతో, ఇండియన్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఆమెకు అండగా నిలిచారు.

మ్యాచ్ ముందురోజు డిన్నర్ చేయడం వల్లే మాలిక్ విఫలమయ్యాడనడం సరికాదని, ఓ భర్తగా భార్యను బయటికి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ చాలా పెద్ద గేమని, షోయబ్ మాలిక్ విఫలమవ్వడానికి సానియా మీర్జాను బాధ్యురాలిని చేయడం సరికాదని, వేరేవారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ వద్దని భారత ఫుట్ బాల్ స్టార్ బైచూంగ్ భూటియా అన్నాడు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల ప్రభావం తన కెరీర్ పై పడకుండా చూసుకోవాలని పలువురు ప్రముఖ ఆటగాళ్లు సానియాకు సలహాలు ఇస్తున్నారు.
Go Back to Shorts
India
Pakistan
Sania Mirza
Cricket

More Telugu News